రాజకీయాల్లో ఎవరి బెదిరింపులకూ తాను భయపడే ప్రసక్తే లేదని, కేవలం స్నేహంతో మాత్రమే తనను గెలవగలరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చంచల్‌గూడ-సంతోష్‌నగర్ మధ్య నిర్మించిన భారీ స్టీల్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్నేహం కోసం తాను ఏదైనా చేయగలనని, కానీ హెచ్చరికలకు లేదా బెదిరింపులకు మాత్రం తలవంచే వ్యక్తిని కానని పునరుద్ఘాటించారు. ఎన్నికలు రావడం, పోవడం, గెలుపోటములు రాజకీయాల్లో సర్వసాధారణమని ఆయన పేర్కొన్నారు.