కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో రూ.624.88 లక్షల విలువైన 78 వరద నష్ట పునరుద్ధరణ పనులకు, 2026–27 మార్కెటింగ్ సీజన్‌లో తోతాపురి మామిడికి మద్దతు ధర అమలు చేసేందుకు, కిలోకు రూ.10 చొప్పున పొగాకు రైతులకు నేరుగా నగదు బదిలీ ద్వారా అందించేందుకు ప్రతిపాదనకు క్యాబినేట్ ఆమోదం తెలిపింది. వెలిగొండ ప్రాజెక్టులోని పనులకు రూ.11.63 కోట్ల వ్యయం చేయడానికి అనుమతి మంజూరు చేసింది. “అమరావతి సంఘమం” నిర్మాణానికి రూ.759.793 కోట్ల అంచనా వ్యయానికి క్యాబినేట్ ఆమోదం తెలిపింది.