స్థానిక ఎన్నికలను ఉద్దేశపూర్వకంగా వాయిదా వేయించి, తద్వారా కేంద్ర ఫైనాన్స్ కమిషన్ నిధులు నిలిచిపోయేలా చేసి రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీయాలని వైఎస్సార్‌సీపీ కుట్రలు పన్నుతోందని లోకేశ్ మండిపడ్డారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేసే ప్రసక్తే లేదని, అక్టోబర్ నాటికే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామని తేల్చిచెప్పారు. కోర్టుల్లో ఉన్న పెండింగ్ అంశాలను చట్టబద్ధంగా పరిష్కరిస్తున్నామని, ముందుగా మున్సిపల్ ఎన్నికలు, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, చివరగా పంచాయతీ ఎన్నికలు క్రమపద్ధతిలో నిర్వహిస్తామని వెల్లడించారు.