తెలంగాణ మంత్రివర్గం నుంచి కొండా సురేఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బర్తరఫ్ చేయడం రాజకీయంగా పెను సంచలనం రేపింది. ఈ నిర్ణయంపై సురేఖ కుమార్తె సుస్మిత తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తన తల్లికి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తంచేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆమె శాపనార్థాలు పెట్టారు. తల్లి బర్తరఫ్‌పై స్పందించిన సుస్మిత “నా తల్లికి అన్యాయం జరిగింది. ఆమెపట్ల అనుసరించిన తీరు నన్ను తీవ్రంగా బాధించింది. మా అమ్మ గొంతును ఎవరూ నొక్కలేరు. నేను రేవంత్ రెడ్డిని శపిస్తున్నా” అని వ్యాఖ్యానించారు.