కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడంపై ఆమె భర్త కొండా మురళీ స్పందించారు. ‘ఇదేం కొత్త కాదు, ఉన్నది ఉన్నట్లు, కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడితే ఎవరూ తట్టుకోరు. ఇవాళ మేం, రేపు ఎవరో. పదవులున్నా లేకున్నా మా గౌరవం మాకు ఉంటుంది. మేము ప్రతిదానికీ స్పందిచకపోవచ్చు. కానీ, ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉంటాం. అన్ని దరిద్రాలు ఏకమై మా మీద చేస్తున్న రాజకీయ దాడులకు గట్టిగా నిలబడుతాం. మొండిగా ఎదురు వెళ్లగలం’ అని పేర్కొన్నారు.