పత్రికల్లో ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో సీఎం, ప్రధాని, లోకేష్, పవన్ కళ్యాణ్ ఫొటోలు మాత్రమే ఉన్నాయిదీనిపై మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు వ్యంగాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రి గారూ,.. మీరు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు తప్పించి కాబినెట్ లోని మంత్రులందరూ నామమాత్రులే అనేది లోక విదితం, కేసీఆర్ 2018 లో 68 రోజుల పాటు తాను,మహమూద్ ఆలీ, కాబినెట్ లేకుండా నడిపారు, మీరు కూడా త్రీ మెన్ కాబినెట్ తో పరిపాలించెయ్యొచ్చుగా? ఎందుకు ఖర్చు దండగ? అంటూ ఏబీవీ చురకలు అంటించారు.

