గుజరాతీ సినీ పరిశ్రమలో సంచలన విజయాన్ని అందుకున్న సినిమా ‘లాలో: కృష్ణ సదా సహాయతే’ సినిమా మౌత్ టాక్‌తో సరికొత్త రికార్డులు నెలకొల్పింది. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ కథ బాగా కనెక్ట్ అవుతుందని రీమేక్ హక్కులను నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నట్లు సమాచారం. శ్రీకృష్ణుడి పాత్రను చరణ్ వంటి పాన్ ఇండియా స్టార్ పోషిస్తే సినిమాకు ప్రత్యేక ఆకర్షణ వస్తుందని, ఆయన ఇమేజ్‌కు ఈ తరహా ఆధ్యాత్మిక, భావోద్వేగభరితమైన పాత్ర కొత్త కోణాన్ని జోడిస్తుందని వార్తలు వస్తున్నాయి.