ఒక వంశంలో 200 ఏళ్ల తర్వాత ఆడపిల్ల పుట్టింది. ఐదు తరాల తర్వాత ఆడబిడ్డ జన్మించడంతో ఆ కుటుంబంలో ఆనందానికి అంతులేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఆసుపత్రి నుంచి ఇంటి వరకు తల్లీ, బిడ్డను ప్రత్యేక రథంలో ఊరేగించారు. డప్పులు, మేళ తాళాల మధ్య ఘన స్వాగతం పలికారు. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా అహ్మద్‌పూర్ తాలూకాలోని కోల్‌వాడి గ్రామానికి చెందిన లింబాజీ దహిఫలే వంశంలో గత ఐదు తరాలుగా ఆడపిల్ల పుట్టలేదు.