తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ సెప్టెంబర్ 28న నవజాత శిశువులకు ఒక గ్రాము బంగారు ఉంగరం అందించే పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. తొలి విడత పంపిణీ కోసం 1.28 లక్షల బంగారు ఉంగరాలను ప్రభుత్వం సమీకరించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆసుపత్రుల్లో జన్మించే శిశువులందరికీ ఈ ఉంగరాలను అందించనున్నట్లు అధికారిక ప్రకటనలో తెలిపింది. ప్రతి బంగారు ఉంగరానికి ప్రత్యేక సీరియల్ నంబర్ ఉంటుంది. అలాగే ఉంగరాలను ట్యాంపర్ ప్రూఫ్ ప్యాకేజింగ్‌లో అందించనున్నారు.