నరేంద్ర మోదీ, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ లపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇద్దరూ అధికారం కోసం ఆరాటపడుతూ దేశ సంపదను ధనికులకు దోచిపెడుతున్నారని ఆయన ఆరోపించారు.
తన చర్యలతో మమతాబెనర్జి బెంగాల్‌ను నాశనం చేస్తే.. మోదీ దేశాన్ని నాశనం చేస్తున్నారని విమర్శించారు. ఒకవైపు కాంగ్రెస్ ఐక్యత, సౌభ్రాతృత్వం.. మరోవైపు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల ద్వేషం, హింస మధ్య పోరాటం జరుగుతోందని న్నారు. హుగ్లీ జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ రాహుల్‌గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.

