ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ తమ యూజర్ల కోసం ‘ఎక్స్‌చాట్’ (XChat) పేరుతో ఒక ప్రత్యేకమైన మెసేజింగ్ యాప్‌ను శుక్రవారం అధికారికంగా ప్రారంభించింది. ప్రస్తుతం ఈ యాప్ కేవలం ఐఓఎస్ (iOS) వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. యాప్‌లో వినియోగదారుల గోప్యతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. పంపిన మెసేజ్‌లను ఎడిట్ చేసుకోవడం, వద్దనుకుంటే అందరికీ కనిపించకుండా డిలీట్ చేయడం లాంటి ఆప్షన్లు ఇందులో ఉన్నాయి.
అలాగే ఒకసారి చూశాక వాటంతట అవే మాయమయ్యే డిసప్పియరింగ్ మెసేజెస్ ఆప్షన్‌ను కూడా పొందుపరిచారు.

