తూర్పు పసిఫిక్ సముద్రంలో డ్రగ్స్ రవాణా చేస్తున్న బోటుపై దాడి చేసి ఇద్దరిని హతమార్చినట్టు అమెరికా మిలిటరీ వెల్లడించింది. లాటిన్ అమెరికా సాగర జలాల్లో డ్రగ్ రవాణా నౌకలను పేల్చివేయడం గత సెప్టెంబర్ నుంచి ట్రంప్ ప్రభుత్వం లక్షంగా పెట్టుకుంది. అయితే రవాణా చేస్తున్న నౌకలేమిటో మిలిటరీ ఎలాంటి ఆధారాలు చెప్పడం లేదు. అమెరికాకు డ్రగ్ వెల్లువను అరికట్టడానికే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు అధ్యక్షుడు ట్రంప్ సమర్ధించుకున్నారు.

