వచ్చే రెండేళ్లలో ఏఐ సాయంతో సగం ప్రభుత్వ కార్యకలాపాలను నడిపించాలని గల్ఫ్ దేశం యూఏఐ (UAE) సంచలన నిర్ణయం తీసుకుంది రెండేళ్లలో సగం ప్రభుత్వ కార్యకలాపాలను ఏజెంటిక్ ఏఐకి (Agentic AI) బదిలీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచంలో ఇది అత్యంత ప్రతిష్టాత్మక ఏఐ మార్పు. యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశాలపై భాగంగా 50 శాతం ప్రభుత్వ విభాగాలు, సేవలు, కార్యకలాపాలు వచ్చే రెండేళ్లలో ఏఐ-ఆధారిత స్వయంప్రతిపత్త వ్యవస్థలకు మారతాయి.

