హైదరాబాద్ మెట్రోపై శనివారం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. మెట్రో బోర్డులో కీలక అధికారులను సర్కార్ నియమించింది. హైదరాబాద్ మెట్రో చైర్మన్ గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) రామకృష్ణారావును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
మెట్రో ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్ కొనసాగనున్నారు. మెట్రో డైరెక్టర్లుగా జయేష్ రంజన్, వికాస్ రాజ్, సుల్తానియా, డీజీపీ శివధర్ ఉండనున్నారు. ఈ నిర్ణయంతో రేవంత్ సర్కార్ చేతికి హైదరాబాద్ మెట్రో రైలు వెళ్ళింది. ఈ నెల 30న రూ.15 వేల కోట్ల డీల్ పూర్తికి సర్కార్ నిర్ణయం తీసుకుంది.

