‘ఛలో పార్లమెంట్’కు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించడంతో సోనమ్ వాంగ్‌చుక్ భార్య అన్మోగ్ గీతాంజలి కీలక వ్యాఖ్యలు చేశారు దీక్షకు విరమణకు ప్రభుత్వానికి రెండు షరతులు విధించారు. భార్య అన్మోగ్ గీతాంజలి ద్వారా తన కండీషన్స్‌ను తెలియజెప్పారు సోనమ్. ‘రాజకీయ నాయకులు ఆస్పత్రికి వచ్చి ఆయనను కలవాలి. రెండోది.. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం గురించి చర్చించాలి’. ఈ రెండు డిమాండ్స్‌కు కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే సోనమ్ తన దీక్షను విరమిస్తారని గీతాంజలి పేర్కొన్నారు.