నీట్ ఆందోళనల్లో భాగంగా ప్రధాని మోదీ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మైనర్ బాలిక పై కేసును కొనసాగించబోమని ఢిల్లీ పోలీసు వర్గాలు స్పష్టంచేశాయి. ఈ ఘటనకు సంబంధించి నోయిడా పోలీసులు ఇటీవల ‘జీరో ఎఫ్ఐఆర్’ నమోదుచేసి ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కు బదిలీచేశారు. తన కుమార్తెపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో పోలీసులు వయసు 25 ఏళ్లుగా నమోదు చేశారని, కానీ ఆమె వయసు 15 ఏళ్లే అని తన తల్లి చెప్పిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.