ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో అత్యంత కీలకమైన ‘రంగం’ (భవిష్యవాణి) ఉదయం మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఈ ఏడాది విపరీతమైన కుంభవృష్టి వర్షాలు కురుస్తాయని, అగ్నిప్రమాదాలు సంభవించి ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని, తాను సంతోషంగా రాలేదని, తీవ్ర ఆగ్రహం (క్రోధం)తో వచ్చానని చెప్పారు. తాను గతంలో చెప్పిన విగ్రహప్రతిష్ఠను ఇంకా పూర్తి చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విగ్రహప్రతిష్ఠ పనులను రాబోయే 6 నెలల వ్యవధిలో తప్పనిసరిగా పూర్తి చేయాలని, లేకపోతే తీవ్రమైన ప్రాణనష్టం మరియు విపత్తులు తప్పవని స్పష్టం చేశారు.