ట్రైనీ ఐపీఎస్ కృష్ణారెడ్డి కేసులో సీన్ రీ కన్స్ట్రక్షన్ లో భాగంగా అధికారులు అశోక్ నగర్లోని కృష్ణారెడ్డి నివాసంలో లాప్టాప్, సెల్ ఫోన్, ఇద్దరు వ్యక్తుల చేతిరాతతో రాసిన రెండు ప్రేమలేఖలు, ఒక కత్తి స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రేమలేఖలపై ఉన్న పేర్ల ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు అతనికి ఆంధ్రప్రదేశ్ కు చెందిన మరో మహిళతో కూడా సన్నిహిత సంబంధం ఉన్నట్టు గుర్తించారు. లివ్ ఇన్ రిలేషన్ కు అతను ప్రతిపాదన చేశారు. అయితే చట్టపరంగా విడాకులు రాకపోవడంతో ఆమె నిరాకరించినట్టు తెలుస్తోంది.