బెజవాడ దుర్గమ్మ ఆలయంలోని రాజగోపురం ఎదురుగా ఓ యువతి నాట్యం చేసిన వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం ఆమె నాట్యం చేస్తూ ఆ వీడియోను పోస్టు చేయడంపై ఆలయ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయంలోకి వచ్చి ఇలా డ్యాన్స్ చేయడం ఏంటంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత యువతి నాట్యం విషయంలో దేవస్థానం ఈఓ వి.కె.శీనా నాయక్ ఆదేశాల మేరకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ అధికారి వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
<span;>