బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఖాళీ చేసిన బంకీపూర్ సీటుకు ఉప ఎన్నిక రావడంతో ఉన్నట్లుండి బరిలోకి దిగిన ప్రశాంత్ కిషోర్ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. తాజా సమాచారం మేరకు మూడవ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి, ఆయన బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హా కంటే 1,162 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు. మూడు రౌండ్ల తర్వాత ప్రశాంత్ కిషోర్ 5,032 ఓట్లు సాధించగా, సిన్హా 3,870 ఓట్లు పొందారు, ఆర్జేడీ అభ్యర్థి రేఖా గుప్తా 767 ఓట్లతో మూడవ స్థానంలో ఉన్నారు.