కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను మంగళవారం రాత్రి ఆస్పత్రిలో చేర్చారు. సోనియా గాంధీ గురుగ్రామ్‌లోని మెదాంత ఆసుపత్రిలో చేరారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయని ఏఎన్ఐ వార్తా సంస్థ రిపోర్టు చేసింది. సోనియా గాంధీని మంగళవారం రాత్రి 10.22 గంటలకు ఆసుపత్రిలో చేర్చారని, ఆమె పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. రాహుల్ గాంధీ కూడా ఆస్పత్రికి చేరుకుని తన తల్లి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి వివరాలు తెలసుకున్నారు.

