జోర్హాట్ ఎయిర్ బేస్‌లో భారత వైమానిక దళానికి చెందిన AN-32 విమానం కుప్పకూలింది. ల్యాండింగ్ సమయంలోనే ఈ ప్రమాదం జరగడంతో విమానం నుండి పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి,ఆ ప్రాంతమంతా పొగతో నిండిపోయింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర బృందాలు మంటలను అదుపు చేయడంలో నిమగ్నమయ్యారు. అయితే, ఈ ప్రమాదం ఎందుకు జరిగిందనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. విమానంలో ఉన్న సిబ్బంది ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే దానిపై కూడా ఇంకా సమాచారం అందలేదు.