వెనిజులా వేదికగా ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ నెట్‌వర్క్‌ను నడుపుతున్న అత్యంత ప్రమాదకరమైన ‘ట్రైన్ డి ఆరాగ్వా’ గ్యాంగ్ లీడర్, మోస్ట్ వాంటెడ్ డ్రగ్ లార్డ్ రసెన్ఫోర్డ్ గురెరో ఫ్లోర్స్ ను అమెరికా సైన్యం విజయవంతంగా అంతం చేసింది. ఈ ఆపరేషన్ వివరాలను అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ స్వయంగా మీడియాకు వెల్లడించారు. గ్యాంగ్ ప్రధాన కాంపౌండ్‌ను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు (ఎయిర్ స్ట్రైక్స్) జరిపినట్లు, అక్కడ బాంబుల వర్షం కురిపించి ఈ డ్రగ్ మాఫియా సామ్రాజ్యాన్ని తుత్తునియలు చేసినట్లు వైట్ హౌస్ ప్రకటించింది.

