హిందువుల అత్యంత పవిత్రమైన వార్షిక అమర్ నాథ్ క్షేత్ర దర్శన యాత్ర నేటి నుంచి వైభవంగా ప్రారంభమైంది. జమ్మూ కాశ్మీర్ లోని మంచులింగాన్ని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో యాత్రికుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, యాత్ర అత్యంత ప్రశాంతంగా, శాంతియుతంగా సాగేలా భద్రతా బలగాలు ముందస్తు వ్యూహంతో పక్కా ప్లాన్ రూపొందించాయి. మారుమూల మార్గాలు, బేస్ క్యాంపుల వద్ద అదనపు బలగాలను మోహరించి నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.