ప్రతిష్ఠాత్మక నార్వే చెస్ 2026 టోర్నమెంట్‌లో భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద మరోసారి విశ్వరూపం చూపించాడు. నిన్న జరిగిన క్లాసికల్ గేమ్‌లో ప్రపంచ నెంబర్ 1, నార్వే దేశపు చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్‌సన్‌ను అద్భుతమైన ఎత్తులతో చిత్తు చేశాడు. ఇదే టోర్నీలో కార్ల్‌సన్‌పై ప్రజ్ఞానందకు ఇది రెండో విజయం కావడం విశేషం. ఈ అసాధారణ గెలుపుతో, ఒకే క్లాసికల్ ఫార్మాట్ టోర్నమెంట్‌లో కార్ల్‌సన్‌ను రెండుసార్లు ఓడించిన మొట్టమొదటి భారతీయ ఆటగాడిగా ప్రజ్ఞానంద సరికొత్త రికార్డు నెలకొల్పాడు.