బాలీవుడ్ డాన్ ఫ్రాంచైజీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకుంది. డాన్, డాన్ 2 తర్వాత రణ్వీర్ సింగ్ కీలక పాత్రలో ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో డాన్ -3 నిర్మించనున్నట్లు ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ సంస్థ 2023లోనే ప్రకటించింది. అధికారికంగా ప్రకటించినా ఈ ప్రాజెక్ట్ ఇప్పటికీ పట్టాలెక్కకలేదు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి రణ్వీర్ తప్పుకోవడం వివాదానికి దారి తీసింది. దీంతో తమకు రూ.40 కోట్లు పరిహారంగా చెల్లించాలని నిర్మాణ సంస్థ రణ్వీర్ను డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

