దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (tCS)కు చెందిన పలువురు మహిళా ఉద్యోగులు.. తమ టీమ్ లీడర్లు ఆఫీసులోనే తమపై లైంగిక వేధింపులకు, మతమార్పిడికి ప్రయత్నించారని చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు 2022 నుంచి రెండు, మూడేళ్ల పాటు తమపై ఇలా వేధింపులు జరిగాయని ఆరోపించారు.అరెస్టైన వారిలో ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్, షారుఖ్ ఖురేషి, రజా మెమన్ , తౌసిఫ్ అత్తర్ ఉన్నారు. దీంతో మహారాష్ట్రలోని నాసిక్‌లో తీవ్ర కలకలం రేగుతోంది.

