లండన్‌లో భారత సంతతి వ్యక్తి చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. లండన్‌లో హర్మాన్ సింగ్ కపూర్ హ్యామ్మర్స్మిత్ ప్రాంతంలో 16 ఏళ్లుగా ఇండియన్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. పెరుగుతున్న నిర్వహణ ఖర్చులతోపాటు ఆన్లైన్ వేధింపులు, ముఖ్యంగా పాకిస్తానీయుల నుంచి తరచూ ఎదురవుతున్న దాడులు, బెదిరింపులు, అలాగే ఈ దాడుల అంశంలో పోలీసుల నుంచి సరైన మద్దతు లేని కారణంగా ఈ రెస్టారెంట్‌ను మూసేస్తున్నట్లు ప్రకటించాడు.

