శ్రీలంక రాజధాని కొలంబో వేదికగా జరిగిన తొలి మహిళా అంధుల టీ-20 ప్రపంచకప్లో భారత జట్టు విజయకేతనం ఎగురవేయడంలో కీలక పాత్ర పోషించింది కరుణ కుమారి. ఈ గిరిజన యువతికి విశాఖలో ఘన స్వాగతం లభించింది. తోటి అంధ విద్యార్థులతో కలిసి ఆమె భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తూ కలెక్టర్ కార్యాలయం వరకు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కరుణకు శాలువాతో ఘనంగా సత్కరించి, లక్ష రూపాయల నగదు బహుమతిని అందజేశారు.