హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో సిఎం రేవంత్‌రెడ్డి సందడి చేశారు. తన పర్యటనలో భాగంగా సిఎం పలు కీలక సమావేశాలు, అంతర్జాతీయ సంస్థలతో చర్చలు, విద్యార్థులతో ముఖాముఖీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రముఖ హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో భారతీయ విద్యార్థులతో జరిగిన భేటీ కార్యక్రమం అనేక వర్గాల్లో చర్చకు దారితీసింది. భారతీయ విద్యార్థుల ప్రత్యేక ఆహ్వానంతో క్యాంపస్‌ను సిఎం రేవంత్ సందర్శించారు. విజన్ తెలంగాణను గ్లోబల్ మ్యాప్‌లో అగ్రస్థానంలో నిలబెట్టడమే తన ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

