మూడు నెలల క్రితం చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఇద్దరు పిల్లలతో కలిసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి ఆత్మహత్య చేసుకున్న ఘటన పెను మలుపు తిరిగింది. తన భార్య, పిల్లల మరణానికి తన అత్త, బామ్మర్ది, అతని భార్యే కారణమని విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి మేడిపల్లి పోలీసులను ఆశ్రయించారు. వారి నుండి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన అత్త (విజయారెడ్డి తల్లి), బామ్మర్ది చిరంజీవి, అతని భార్య ఆస్తి కోసం తన కుటుంబాన్ని వేధించారని ఆరోపించారు.

