పద్మశ్రీ అవార్డులకు ఎంపికైన రాజేందప్రసాద్, మురళీ మోహన్‌లను మెగాస్టార్ చిరంజీవి సత్కరించారు. ఆయనే స్వయంగా వారి ఇంటికి వెళ్లి శాలువా కప్పి, పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందించారు. ఈ పురస్కారాలు తెలుగు సినిమాకు లభించిన ఈ జాతీయ గౌరవం ఒక మైలురాయిగా పేర్కొన్నారు. వారితో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఇది చిత్ర పరిశ్రమకు నిజంగా ఒక ఆనందకరమైన రోజు అని అభివర్ణించారు. ఈ సందర్భంగా పద్మ అవార్డు పొందినవారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

