జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు షేక్‌పేట డివిజన్, పారామౌంట్ కాలనీలో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, కిషన్ రెడ్డిలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దివంగత ఎమ్మెల్యే పీజేఆర్ చనిపోయినప్పుడు సెంటిమెంట్ లేదని కేసీఆర్ అన్నారని, పీజేఆర్ కుటుంబాన్ని కేసీఆర్ ఆనాడు అవమానించారని, అందుకే పీజేఆర్ విగ్రహం ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

