సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు హ్యాట్రిక్ విక్టరీ నమోదు చేసింది. హోం గ్రౌండ్ ఉప్పల్‌లో వరుసగా మూడు మ్యాచ్‌లలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో దూసుకుపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 135 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. భారీ టార్గెట్ ఛేజింగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 195/9 పరుగులకే పరిమితమైంది. దాంతో సన్‌రైజర్స్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది.

