భారత విమానాలపై గగనతల దిగ్బంధనం మే 24 వరకు పొడిగిస్తూ పాకిస్థాన్ మంగళవారం నిర్ణయం తీసుకుంది. గత ఏడాది ఏప్రిల్ 22న పహల్గాంపై ఉగ్రదాడి తరువాత ఏప్రిల్ 24 నుంచి రెండు దేశాల మధ్య గగనతల దిగ్బంధనం కొనసాగుతోంది. పాకిస్థాన్ ఎయిర్పోర్ట్ అథారిటీ నోటమ్ ప్రకారం ఈ ఏడాది మే 24 ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు, యూరప్ దేశాలకు ఢిల్లీ, అమృత్సర్, జైపూర్ నుండి వెళ్లే సుమారు 800 వారపు విమాన సర్వీసులపై ప్రభావం పడుతుంది.

