శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా సురక్షితంగా బయటపడ్డారు. శ్రీశైలం నుంచి మార్కాపురం వెళ్తుండగా.. దోర్నాల మండలం చిన్నారుట్ల-తుమ్మలబైలు సమీపంలోని మలుపు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు వేగాన్ని డ్రైవర్ నియంత్రించలేకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

