నేపాల్ ల్లో భారీ మెజారిటీతో అధికార పీఠాన్ని అధిరోహించిన బాలెన్ షా ప్రభుత్వానికి నెల తిరగకముందే ఇప్పుడు దేశవ్యాప్త నిరసనల సెగను ఎదుర్కొంటున్నారు. కాఠ్మండు వీధుల నుండి దేశ పరిపాలనా కేంద్రమైన ‘సింఘా దర్బార్’ వరకు ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. 100 పైబడిన ప్రతి వస్తువుపై కస్టమ్స్ సుంకం విధించాలన్న నిర్ణయం నేపాల్‌లో చిచ్చు రేపింది. సరిహద్దు ప్రాంత ప్రజలు నిత్యావసరాల కోసం భారత్‌పైనే ఆధారపడతారు. ఈ నిర్ణయం తమ పొట్ట కొట్టడమేనని సామాన్యులు రోడ్డెక్కారు. మరోవైపు హోం మంత్రిపై అవినీతి ఆరోపణలు నిరసనలకు కారణమైంది.

