నియోజకవర్గాల పునర్విభజన బిల్లు తమిళనాడు ఉనికిని దెబ్బతీసేలా ఉందని సిఎం స్టాలిన్ మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా హామీలను నమ్మలేమన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చట్ట సవరణ పేరుతో కొత్త కుట్రలకు తెరలేపారని, రాష్ట్రాల హక్కులు కాలరాయడమేనని మండిపడ్డారు. నోటి మాటలతో హామీలు ఇవ్వడం కాదు అని, చట్టసభల్లో రక్షణ కల్పించాలని సూచించారు. కొత్తగా ఏర్పాటు చేసే కమిషన్‌కు కేంద్రం అపరిమిత అధికారాలు కట్టబెట్టిందని ధ్వజమెత్తారు.

