పిల్లలను లైంగికంగా వేధించడంతోపాటు లైంగిక వీడియోలు రికార్డ్ చేసి విదేశీయులకు, డార్క్ వెబ్‌లో అమ్మారు. సీబీఐ దర్యాప్తు చేసిన ఈ కేసులో భార్యాభర్తలకు పోక్సో కోర్టు మరణశిక్ష విధించింది. బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లాకు చెందిన నీటిపారుదల శాఖలో జూనియర్ ఇంజినీర్ రామ్ భవన్, అతడి భార్య దుర్గావతి సమీప జిల్లాలకు చెందిన ఐదు నుంచి 16 ఏళ్ల పిల్లలను మభ్యపెట్టి లైంగిక చర్యలను వీడియో రికార్డ్ చేశారు.

