పాకిస్థాన్‌లోని నైరుతి ప్రావిన్స్ బలూచిస్థాన్ గత 40 గంటలుగా భీకర పోరాటంతో అట్టుడుకుతోంది. వేర్పాటువాద గ్రూపులు సృష్టించిన విధ్వంసం, దానికి ప్రతిగా భద్రతా దళాలు చేపట్టిన భారీ ఆపరేషన్‌లో మొత్తం 145 మంది తీవ్రవాదులు హతమయ్యారు. “ఉగ్రవాదులపై మా దళాలు పైచేయి సాధించాయి. కానీ ఈ క్రమంలో అమాయక పౌరులను, సైనికులను కోల్పోవడం బాధాకరం” అని బలోచిస్థాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ పేర్కొన్నారు. ప్రావిన్స్‌లోని వివిధ జిల్లాల్లో ఏకకాలంలో దాడులు జరగడంతో సైన్యం తక్షణమే రంగంలోకి దిగి ఎదురుదాడి ప్రారంభించింది.

