బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లోని నందినగర్ నివాసానికి చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా విచారణకు హాజరయ్యేందుకు ఎర్రవెల్లిలోని ఆయన నివాసం నుంచి బయల్దేరి, బంజారాహిల్స్ నందినగర్‌లోని నివాసానికి వచ్చారు. కాసేపట్లో ఆయన సిట్ విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే సిట్ అధికారులు కేసీఆర్ నివాసానికి వచ్చారు. కాగా కేసీఆర్ విచారణ నేపథ్యంలో నందినగర్‌లోని నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. నాలుగంచెల భద్రతను అమలు చేస్తున్నారు.

