వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించడంపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. అధికారం కోసమే జగన్ పాట్లు అంటూ ఎద్దేవా చేశారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో నిర్వహంచిన మీడియా సమావేశంలో షర్మిళ మాట్లాడుతూ అధికారం ఇస్తే ఏం చేశారని ప్రశ్నించారు. జలయజ్ఞం పూర్తి చేయగలిగారా, నవరత్నాల్లో పెట్టిన హామీలను అమలు చేశారా, మద్యనిషేధం అమలు చేశారా అంటూ నిలదీశారు.

