పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) మాజీ సీఈవో వాసిమ్ ఖాన్ ఐసీసీ (ICC) కీలక పదవి నుంచి వైదొలిగారు. ఐసీసీలో జనరల్ మేనేజర్ పదవికి ఆయన రాజీనామా చేశారు. నాలుగేళ్లపాటు ఆ బాధ్యతలు నిర్వర్తించిన ఆయన తాజాగా ఆ పదవిని వీడారు. 2022లో జెఫ్ అల్లార్డెస్ నుంచి వాసీమ్ ఖాన్ బాధ్యతలను స్వీకరించారు. గత రెండేళ్లుగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. వివిధ కారణాలతో అత్యున్నత స్థాయిలో ఉండే వ్యక్తులు తమ పదవులను వీడుతున్నారు.

