ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిటైర్ అయిన ఉద్యోగుల పెన్షన్ల మంజూరు ప్రక్రియలో జాప్యాన్ని తగ్గించేందుకు, పారదర్శకతను పెంచేందుకు మే ఒకటో తేదీ నుంచి అన్ని రకాల పెన్షన్ కేసులను నిధి పోర్టల్ ద్వారా ప్రాసెస్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఫిజికల్ అప్లికేషన్లకు ఏప్రిల్ 30వ తేదీతో స్వస్తి చెప్పి, మే ఒకటో తేదీ నుంచి నూతన విధానాన్ని అమలు చేయనుంది. నిధి పోర్టల్ ద్వారా మాత్రమే పెన్షన్ కేసుల పరిశీలనతో పాటుగా రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ప్రాసెసింగ్ సిస్టమ్ (RBPS) అమలు చేయాలని ఏపీ ఫైనాన్స్ డిపార్టుమెంట్ ఆదేశాలు జారీ చేసింది.

