టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నాసిక్ (TCS Nashik) శాఖలో లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడి పరిణామాలు టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తీవ్ర ఆందోళనకరమైనవని, భాదాకరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోపణలపై నిజనిర్ధారణ చేయడానికి, బాధ్యులను గుర్తించడానికి టీసీఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆరతి సుబ్రహ్మణియన్ ఆధ్వర్యంలో విచారణ కమిటీ వేసినట్లు ఆయన ప్రకటించారు. ిందితులైన ఉద్యోగులపై ఇప్పటికే చర్యలు
తీసుకోవడం ప్రారంభించినట్లు తెలిపారు. పోలీసుల విచారణకు కంపెనీ పూర్తిగా సహకరిస్తోందని స్పష్టం చేశారు.

