బాంబులు, తూటాలకు పశ్చిమ బెంగాల్ ప్రజలు ఓట్లతో సమాధానం చెబుతారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రాష్ట్రంలో మాఫియా రాజ్యానికి ప్రజలు అంతం పలుకబోతున్నారని పరోక్షంగా టిఎంసిని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. సోమవారంనాడు బీర్బుమ్ జిల్లాలోని మయూరేశ్వర్ ఎన్నికల బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఎన్నికల్లో ఎలాంటి హింసకు పాల్పడకుండా టిఎంసి గుండాలు ఇళ్లకే పరిమితం కావాలని, లేకపోతే తాము అధికారంలోకి వచ్చాక అలాంటి వారిని గుర్తించి తప్పకుండా శిక్షిస్తామని అమిత్ షా హెచ్చరించారు.

