ములుగు జిల్లా గోవిందరావుపేటకి చెందిన ఆర్ఎంపి వైద్యుడు శ్రావణ్ కుమారుడు హర్షిత్ నందన్(4) ఆదివారం సాయంత్రం స్నేహితులతో కలిసి ఆడుకుంటూ అంగన్వాడి కేంద్రం సమీపంలోని ప్రకృతి వనం వైపు వెళ్ళాడు. దీంతో కోతుల కోసం విషగూళికలతో కలిపిన బాలామృతాన్ని హర్షిత్ నందన్ చూసి దాన్ని తినేశాడు. అనంతరం ఇంటికి వెళ్లగా కాసేపటకు అస్వస్థకు గురి కాగా ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ హర్షిత్ నందన్ సోమవారం మృతి చెందాడు.

