బెంగళూరులో దారుణం జరిగింది. రోడ్డుపై కానిస్టేబుల్ ఒక బైకుమీద పిల్లలతో ఆగిఉండగా.. వారిపైకి స్కూల్ బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మరణించారు. ఈ ఘటన నార్త్ బెంగళూరులోని మూల మలుపు వద్ద పిల్లలిద్దరితో కలిసి బైకుపై ఆగిఉన్నాడు. అదే సమయంలో అక్కడికి ఒక స్కూల్ బస్సు వేగంగా వచ్చి టర్న్ తీసుకుంది. రోడ్డుపై ఉన్న వీరిని గమనించకుండా డ్రైవర్ నిర్లక్ష్యంగా స్కూల్ బస్సు నడిపాడు. దీంతో బైకు పక్కకు పడిపోగా, చిన్నారులిద్దరూ బస్సు టైర్ల కింద పడిపోయారు.

