loader

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులోని పెదపాడు రామాలయ పునర్నిర్మాణం అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. గత కొన్ని రోజులుగా స్థానికంగా రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసిన ఈ వివాదంపై న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మతపరమైన కట్టడాల విషయంలో నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని పేర్కొంది. ఏ మతపరమైన నిర్మాణం చేపట్టాలన్నా జిల్లా కలెక్టర్ , మున్సిపల్ కమిషనర్ అనుమతులు తప్పనిసరని కోర్టు వెల్లడించింది. అనుమతులు లభించే వరకు ప్రస్తుతం ఉన్న కట్టడాన్ని తాకవద్దని ఆదేశించింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON