మంచు తుపాను కారణంగా అమెరికాలోని 18 రాష్ట్రాలు గజ గజ వణికిపోతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో వింటర్ ఎమర్జెన్సీ ప్రకటించింది ప్రభుత్వం. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావొద్దంటూ హెచ్చరికలు జారీ అయ్యాయి.
10 వేలకు పైగా విమాన సర్వీసులను ముందు జాగ్రత్త చర్యగా రద్దు చేశారు. ఫెర్న్‌గా పేర్కొంటున్న ఈ తుఫాన్‌కు ఆర్కిటిక్ బ్లాస్ట్ వల్ల ఉత్తర ధ్రువం నుంచి వీస్తున్న అతి శీతల గాలులే కారణమని వాతావరణ శాఖ తెలిపింది.

